స్లాట్.. రెడీ..

1 Aug, 2016 23:04 IST|Sakshi
స్లాట్.. రెడీ..
► నేటి నుంచి ఆర్టీఏ ఆన్‌లైన్‌ సేవలు
► 57 రకాల పౌరసేవలు ఇక ఆన్‌లైన్‌లోనే
► పూర్తిగా కాగిత రహిత, నగదు రహిత సేవలు
► ఈ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ సెంటర్‌లలో నమోదు
 
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ సేవలు ఇక పూర్తిగా ‘ఆన్‌లైన్‌లో’కి వచ్చేశాయి. రవాణాశాఖ అందజేసే సుమారు 58 రకాల పౌరసేవలు  మంగళవారం నుంచి  ఆన్‌లైన్‌లోనే లభించనున్నాయి. ఇందుకోసం నేటి  నుంచి  స్లాట్‌ (సమయం, తేదీ) ప్రకారమే పౌరసేవలను అందజేస్తారు. నేరుగా  ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకొనేందుకు, అక్కడిక్కడే ఫీజు చెల్లించేందుకు ఇక ఏ మాత్రం అవకాశం ఉండదు. నగదు రహిత, కాగిత రహిత సేవలు పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి. వినియోగదారులు తమకు కావలసిన సేవల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు చేసుకున్న 24 గంటలలోపు నెట్‌ బ్యాంకింగ్‌ లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించాలి. తమకు లభించిన స్లాట్‌ ప్రకారం ఒరిజినల్‌ డాక్యుమెంట్‌లతో వెళ్లి అధికారులను సంప్రదించాలి. వాటిని  సమగ్రంగా పరిశీలించిన అనంతరం అధికారులు సంతృప్తి చెందితే వినియోగదారుల నుంచి డిజిటల్‌ సంతకం, ఫొటో, బొటన వేలి ముద్ర తీసుకొని పంపేస్తారు. ఆ తరువాత స్పీడ్‌ పోస్టు ద్వారా వినియోగదారులు ఆశించిన  పౌరసేవలు  ఇంటికి చేరుతాయి.
 
వినియోగదారులు అందజేసే డాక్యుమెంట్‌లలో ఏవైనా తక్కువ ఉంటే ఆ పనిని పెండింగ్‌లో ఉంచుతారు. సరైన ధృవపత్రాలతో వచ్చినప్పుడే పెండింగ్‌ పని పూర్తవుతుంది. ఏ రకమైన పౌర సేవ కోసం ఏయే డాక్యుమెంట్‌లు అందజేయాలనే సమాచారం స్లాట్‌ బుకింగ్‌ సమయంలోనే వినియోగదారుల మొబైల్‌ ఫోన్‌కు అందుతుంది. రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ఆటోమేటెడ్‌ ఆన్‌లైన్‌ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు వివిధ రూపాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 
 
1400 ఈ సేవా కేంద్రాల్లో నమోదు...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 1400 ఈ సేవ, మీ సేవ కేంద్రాల ద్వారా రవాణాశాఖ సేవల కోసం స్లాట్‌ నమోదు చేసుకొని, అక్కడే ఫీజు చెల్లించవచ్చు. స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేని వాళ్లు, ఇళ్లల్లో ఇంటర్నెట్‌ సదుపాయం లేని వాళ్లకు ఇది చక్కటి అవకాశం. తెలంగాణ అంతటా 4 వేల ఈ సేవా కేంద్రాల ద్వారా ఈ సదుపాయం లభిస్తుందని హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ టి.రఘునాథ్‌ ‘సాక్షి’తో  చెప్పారు. డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్‌లు, బదిలీలు, పలు ధృవపత్రాల రెన్యూవల్స్, పన్నులు, అపరాధ రుసుముల చెల్లింపులు వంటి అన్ని రకాల పౌరసేవల కోసం వినియోగదారులు ఇక నుంచి స్లాట్‌ (సమయం, తేదీ) ప్రకారమే సంప్రదించవలసి ఉంటుంది.  
 
అన్ని సేవలకు కేరాఫ్‌ ఆన్‌లైన్‌...
లెర్నింగ్‌ లైసెన్సు (ఎల్‌ఎల్‌ఆర్‌) కోసం స్లాట్‌ నమోదు చేసుకోవడంతో పాటు, కాలపరిమితి ముగిసిన ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం కూడా స్లాట్‌ నమోదు చేసుకోవలసి ఉంటుంది. డూప్లికేట్‌ లెర్నింగ్‌ లైసెన్సు, ఫెయిల్‌ అయిన వారు మరోసారి టెస్ట్‌కు హాజరుకావాలన్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యూవల్, రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతించే బ్యాడ్జ్, ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్, డ్రైవింగ్‌ లైసెన్సులో చిరునామా మార్పు, కొత్త ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌లు, డూప్లికేట్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌లు, త్రైమాసిక పన్ను, గ్రీన్‌ట్యాక్స్‌ వంటి పన్నులు, వాహనాలపై విధించే అపరాధ రుసుములు సైతం ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించవలసి ఉంటుంది. వాహనం నమోదు, హైర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్, హైర్‌ పర్చేస్‌ టర్మినేషన్, యాజమాన్య బదిలీ, డూప్లికేట్‌ ఆర్‌సీ, ఆర్‌సీ రెన్యూవల్‌ చేసుకోవడం, చిరునామా మార్పు, వాహనానికి అదనపు హంగులు సమకూర్చుకోవడం, ఎన్‌ఓసీ తీసుకోవడం వంటి అన్ని రకాల సేవల కోసం  ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు చేసుకోవాలి. 
 
స్లాట్‌ బుకింగ్‌ ఇలా....
► ఇంటర్నెట్‌లో ‘తెలంగాణ రవాణాశాఖ వెబ్‌సైట్‌’ ఓపెన్‌ చేయగానే  ఎడమ వైపున ‘ఆన్‌లైన్‌ సర్వీసెస్‌’ అని ఎరుపు రంగులో కనిపిస్తుంది. దానిపైన క్లిక్‌ చేస్తే మొత్తం సేవల వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
► కావలసిన సేవలపైన ‘క్లిక్‌’ చేస్తే ఒక కేలండర్‌ డిస్‌ప్లే అవుతుంది. అందులో  వినియోగదారులు  తమకు అనువైన తేదీ, సమయం బుక్‌ చేసుకోవాలి. ఆ తరువాత  వివరాలను నమోదు చేయాలి. వెంటనే మొబైల్‌ నెంబర్‌కు ఒక ట్రాన్సాక్షన్‌ నెంబర్, ఆర్టీఏలో అందజేయవలసిన డాక్యుమెంట్‌ల వివరాలు ఎస్సెమ్మెస్‌ ద్వారా అందుతాయి.
► పేమెంట్‌ ఆప్షన్‌లో అభ్యర్ధులు నెట్‌బ్యాంకింగ్‌ లేదా ఈసేవా, మీ సేవా, క్రెడిట్, డెబిట్‌ కార్డులను ఎంపిక చేసుకొని ఫీజు చెల్లించవచ్చు,
► ఆన్‌లైన్‌ సేవలను నమోదు చేసుకున్న 24 గంటల వ్యవధిలో ఫీజు చెల్లించాలి.  
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (05-04-2020)

ఇదీ కరోనా సేఫ్టీ టన్నెల్‌

ఆ రెండూ దొరకట్లేదు..

గబ్బిలాలతో వైరస్‌.. నిజమేనా?

ముంగిట్లో జన్‌‘ధన్‌’!

సినిమా

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు