బుల్లి గణపతుల బండి.. బయల్దేరిందండీ

15 Sep, 2016 14:17 IST|Sakshi
బుల్లి గణపతుల బండి.. బయల్దేరిందండీ

ఒకవైపు ఖైరతాబాద్ వినాయకుడి లాంటి 58 అడుగుల మహాగణపతులను అత్యంత జాగ్రత్తగా భారీ వాహనం మీద, పెద్ద క్రేన్ల సాయంతో తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుంటే.. మరోవైపు బుల్లి బుల్లి గణపతి విగ్రహాలతో కూడిన ఒక బండి జియాగూడ నుంచి బయల్దేరింది. దాదాపు 30కి పైగా గణపతి విగ్రహాలను ఈ బండిలో తరలించారు. ముందు.. చిన్నచిన్న నాలుగు చక్రాల బండ్లు సిద్ధం చేసి, వాటిమీద ముఖమల్ క్లాత్ పరిచి, ఆపైన విగ్రహాలను ఉంచారు. వర్షంలో విగ్రహాలు తడవకుండా.. వాటికి రక్షణగా పాలిథిన్ కవర్లను కూడా చుట్టారు. ఈ చిన్నచిన్న బండ్లు అన్నింటినీ రైలు బోగీలలాగ ఒకదాంతో ఒకదానికి అనుసంధానం చేశారు.

మొట్టమొదటి బండి మీద ఎలుక వాహనాన్ని కూడా పెట్టారు. ఈ బండికి రక్షణగా ఒక రోప్ పార్టీని (గణపతి భక్తులు) కూడా ఏర్పాటుచేశారు. వాళ్లు అటూ ఇటూ రెండు తాళ్లు పట్టుకుని.. బండికి గానీ, గణపతి విగ్రహాలకు గానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తుండగా.. జియాగూడ ప్రాంతం నుంచి ఎంజే మార్కెట్ మీదుగా వినాయక సాగర్ వరకు తీసుకెళ్లారు. బుల్లి బుల్లి గణపతి విగ్రహాలతో కూడిన ఈ వెరైటీ రైలు బండిని చూసి అటుగా వెళ్లేవాళ్లంతా ముచ్చట పడుతూ ఆ బండితో సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు