నాటకరంగం చాలా గొప్పది

19 Sep, 2016 23:57 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నాటక రంగం చాలా గొప్పదని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ. రామలింగేశ్వరరావు తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలో డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్‌ 22వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీల 2016 బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి నాటకరంగానికి ఉందన్నారు.  నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజాసామ్యం ధనసామ్యంగా మారిందన్నారు. ధనవంతులే సినీ, రాజకీయ రంగాల్లోకి వస్తున్నారన్నారు. ఏమీలేని వారికి సినిమాల్లో అవకాశం కల్పించిన దాసరి నారాయణరావును సినీ అంబేద్కర్‌గా అభివర్ణిస్తున్నట్లు చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావుకి తాను గొప్ప అభిమానినని, సత్కారాలకు దూరంగా ఉండేతాను డాక్టర్‌ అక్కినేని జీవన సాఫల్య పురస్కారం అంటే అంగీకరించక తప్పలేదన్నారు. మాజీ పార్లమెంట్‌ సభ్యులు, సినీనటుడు డాక్టర్‌ కైకాల సత్యనారాయణ, డాక్టర్‌ అక్కినేని నాటక కళాపరిషత్‌ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు, చిత్ర దర్శకులు కోడి రామకృష్ణ ,  గజల్‌ శ్రీనివాస్‌. క్రిష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు