అన్ని కులాలకు సామాజిక న్యాయం

9 Mar, 2017 02:50 IST|Sakshi
అన్ని కులాలకు సామాజిక న్యాయం

అసెంబ్లీలో చట్టం చేయండి: తమ్మినేని

చండూరు/సాక్షి, హైదరాబాద్‌: ప్రజాసమస్యలపై అసెంబ్లీలో తీర్మానాలు చేస్తే ముఖ్యమంత్రికి దండ పంపిస్తాం.. లేదంటే దండయాత్ర చేయక తప్పదని సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా చండూరుకు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగేలా అసెంబ్లీలో చట్టం చేయాలని సూచించారు. కులాలకు సమానంగా బడ్జెట్‌ కేటాయించాలన్నారు.

ఎంబీసీలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటన చేయడం ఆహ్వానించదగినదేనని.. అదేవిధంగా ఎంబీసీలకు అత్యాచార చట్టం తేవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మరోవైపు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టంలోని అన్ని అంశాలను పకడ్బందీగా అమలు చేయాలని తమ్మినేని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అరవై ఏళ్లు దాటిన కార్మికులకు పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధంగా పెన్షన్‌ ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు