మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అదృశ్యం

29 Mar, 2017 12:56 IST|Sakshi
మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అదృశ్యం

గచ్చిబౌలి: మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ బాల్‌రాజ్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం పోచమ్మ బస్తీకి చెందిన ప్రియాంక గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది.  ఈ నెల 27న ఆఫీసుకు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. భర్త శ్రవణ్‌కుమార్‌ మంగళవారం రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా