నన్ను అంతమొందించే కుట్ర

16 Jan, 2014 04:34 IST|Sakshi
నన్ను అంతమొందించే కుట్ర

హైదరాబాద్: ‘నన్ను అంతమొం దించే కుట్ర జరుగుతోంది..ఎప్పటివరకు బతుకుతానో తెలియదు..భద్రతా సిబ్బంది ఉన్నా.. ప్రాణాలకు భరోసా లేదు..ఏక్షణమైనా ఎవరైనా మట్టుబెట్టొచ్చు’ అని మజ్లిస్‌పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్య లు చేశారు. మహ్మద్‌ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా మజ్లిస్‌పార్టీ ఆధ్యర్యంలో దారుస్సలాం మైదానంలో మంగళవారం తెల్లవారుజాము వరకు జరిగిన బహిరంగసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.

సంఘ్‌పరివార్,హిందుత్వశక్తులు తనను అంతమొందించడం జరిగితే..పాతబస్తీలో ప్రతిఇంట్లో ఒక అక్బరుద్దీన్ గా మారి ముస్లింల పక్షాన గళం విప్పాలని, పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో ముస్లింలపై జరుగుతున్న అఘాత్యాలపై మౌనం వహించడం వల్లే ముజఫర్‌నగర్ లాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు. ‘ముస్లింల పక్షాన గళం విప్పేవారిని జైళ్లలో పెడుతున్నారు. కాల్పులు జరుపుతున్నారు. మజిస్ల్ పా ర్టీని అంతమొందించే కుట్రలు చేశారు. తనను జైలులో ఉంచారు. కనీసం మంచినీళ్లు, దుప్పటి కూడా ఇవ్వలేదు.

 వాంతులు చేసుకున్నా కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇబ్బందులకు గురిచేశారని’ ఆయన వెల్లడించారు. చట్టంపై తనకు నమ్మకం ఉందంటూ..దేశవ్యాప్తంగా ముస్లింల పక్షాన గళం విప్పి తీరుతామని అక్బర్ ప్రకటించారు. కార్యక్రమంలో మజ్లిస్‌పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్  ఓవైసీ, పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు మతగురువులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు