‘నా భర్తను ఎవరో చంపడానికి యత్నించారు’

28 Jul, 2017 12:14 IST|Sakshi

హైదరాబాద్‌ : కాల్పుల ఘటనలో గాయపడ్డ విక్రమ్‌గౌడ్‌ భార్య శిఫాలి మాత్రం తన భర్తపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. దర్గాలో అన్నదానం కోసం ఉదయం రెండున్నర గంటలకు నిద్ర లేచామని తనకంటే ముందు  భర్త హాల్‌లోకి వెళ్లారని తెలిపారు. ఇంతలోనే కాల్పుల శబ్ధం రావడంతో.... కిందకు దిగానని  అప్పటికే విక్రమ్‌ గౌడ్‌ రక్తపు మడుగులో ఉన్నారని చెప్పరు. ఒక వ్యక్తి కాల్పులు జరిపాడని భర్త విక్రమ్‌గౌడ్‌ తనతో చెప్పాడని శిఫాలి చెప్పారు. తన భర్తను ఎవరో చంపడానికి యత్నించారని ఆరోపించిన ఆమె, కాల్పులు జరిపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని... బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా విక్రమ్‌ గౌడ్‌కు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, ఈ బెదిరింపులకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం కిందటే గన్‌ లైసెన్స్‌ కోసం అప్లయి చేయగా పోలీసులు తిరస్కరించారన్నారు. తెలిసినవాళ్లే కాల్పులు జరిపారని, ఒక్కరే వచ్చి కాల్పులు జరిపినట్లు విక్రమ్‌ చెప్పాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. విక్రమ్‌ కోలుకున్న తర్వాత నిందితుడి పేరు చెబుతాడన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు