పెళ్లి చేయడం లేదని తండ్రిపై తల్వార్‌తో దాడి

14 Mar, 2016 08:16 IST|Sakshi
పెళ్లి చేయడం లేదని తండ్రిపై తల్వార్‌తో దాడి

జగద్గిరిగుట్ట: పెళ్లి చేయడం లేదని, ఆస్తి ఇవ్వడం లేదని తండ్రిపై కొడుకు తల్వార్‌తో దాడి చేశాడు.  జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.  స్థానికుల కథనం ప్రకారం... సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లో నివాసముండే షాబుద్దీన్‌కు కుమారులు నాజుద్దీన్ (33),  నిజాముద్దీన్ సంతానం.  చిన్న కుమారుడికి వివాహం చేశారు.

పెద్ద కుమారుడు నాజుద్దీన్ పని, పాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. తనకు కూడా పెళ్లి చేయాలని, ఆస్తి ఇవ్వాలని తల్లిదండ్రులపై అతను కొద్ది రోజులుగా ఒత్తిడి తెస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తండ్రిపై కక్షపెంచుకున్న నాజుద్దీన్ ఆదివారం తల్వార్‌తో దాడి చేశాడు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాబుద్దీన్‌ను చికిత్స నిమిత్త ఆస్పత్రి తరలించి నాజుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు