త్వరలో సమంతతో అధికారిక ఒప్పందం

20 Apr, 2017 08:32 IST|Sakshi
త్వరలో సమంతతో అధికారిక ఒప్పందం

టెస్కో డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌  

సాక్షి, హైదరాబాద్‌: చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా  సినీనటి సమంత సేవలను వినియోగించుకుంటామని, త్వరలో ఆమెతో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని టెస్కో డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌ తెలిపారు. సమంత చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ కాదని వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు.

స్వచ్ఛందంగా చేనేత కోసం ముందుకొచ్చిన సమంత సేవలను వాడుకుంటామన్నారు. చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం తెచ్చేందుకు, డిజైనింగ్, మార్కెటింగ్‌ రంగాల్లో తనకున్న ఆలోచనలు ఆమె తమతో పంచుకున్నారన్నారు.

>
మరిన్ని వార్తలు