ప్రత్యేక హోదాపై నేడు అసెంబ్లీలో తీర్మానం

16 Mar, 2016 04:12 IST|Sakshi

సాక్షి, హైద రాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించటంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం శాసనసభ ప్రత్యేకంగా తీర్మానం ఆమోదించనుంది. మంగళవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కృతజ్ఞతలు తెలుపుతారు. అదే సమయంలో విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానం చేయనున్నారు.

ఈ మేరకు సీఎం ప్రకటన చేస్తారు. ఈ సందర్భంగా ప్రసంగించే ఏ నేత బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీపై ఎలాంటి విమర్శలు చేయొద్దని ముఖ్యమంత్రి సూచించారు. కేవలం కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నట్లుగానే నేతలు ప్రసంగించాలని,  కేంద్రంపై ఒత్తిడి పెంచినట్లు, డిమాండ్ చేసినట్లు మాట్లాడవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు