పండుగలకు ప్రత్యేక రైళ్లు

27 Sep, 2016 04:00 IST|Sakshi

హైదరాబాద్: తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 52 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లన్నింటికీ ప్రత్యేక చార్జీలు వర్తిస్తాయి.

ఈ మేరకు హైదరాబాద్-తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రెయిన్ ఈ నెల 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీలలో సాయంత్రం 5.55 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలలో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్-మైసూర్ (07073/07074) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు మైసూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 3, 10, 17, 24, 31 తేదీలలో సాయంత్రం 6.15 కు మైసూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సంత్రాగచ్చి (కోల్‌కత్తా)-సికింద్రాబాద్ (02849/02850) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 5, 12, 19, 26, నవంబర్ 2, 9, తేదీలలో రాత్రి 11.50 కి సంత్రాగచ్చి నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారు జామున 4.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11 తేదీలలో ఉదయం 6.20 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 10.25 కు సంత్రాగచ్చి చేరుకుంటుంది.

సికింద్రాబాద్-విజయవాడ (07757/07758) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 2, 9, 16, 23, 30 నవంబర్ 6, 13, 20, 27 తేదీలలో ఉదయం 5.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10.45 కు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు సాయంత్రం 5.30 కు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 10.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్-పాట్నా (02793/02794) స్పెషల్ ట్రెయిన్ ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11తేదీలలో ఉదయం 8.35 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 కి పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 2, 9, 16, 23, 31, నవంబర్ 8, 13 తేదీలలో మధ్యాహ్నం 12.45 కు పాట్నా నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.20 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

మరిన్ని వార్తలు