-

వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

27 Apr, 2018 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలకు 100 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్‌ – రక్సౌల్‌: జూలై 3, 10, 17, 24, 31 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 9:40కి బయలుదేరి, తిరుగు ప్రయాణంలో 6, 13, 20, 27, ఆగస్టు 3న మధ్యాహ్నం 12:45కి బయలుదేరుతాయి.  
హైదరాబాద్‌– రక్సౌల్‌: జూలై 5, 12, 19, 26 తేదీలలో రాత్రి 9:50కి బయలుదేరి తిరుగు ప్రయాణంలో జూలై 8, 15, 22, 29 తేదీలలో మధ్యాహ్నం 1:30కి రక్సౌల్‌ నుంచి బయలుదేరుతాయి.
సికింద్రాబాద్‌– బరౌణి: జూలై 1, 8, 15, 22, 29 తేదీలలో రాత్రి 10 గంటలకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో జూలై 4, 11, 18, 25న బరౌణి నుంచి బయలుదేరుతుంది.
సికింద్రాబాద్‌ –విజయవాడ: జూలై 1, 8, 15, 22, 29 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 5:30 బయలుదేరి తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి సాయంత్రం 5:30 బయలుదేరుతుంది.
సికింద్రాబాద్‌– గువాహటి: జూలై 6, 13, 20, 27 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి ఉద యం 7:30కి బయలుదేరి తిరుగు ప్రయాణంలో జూలై 9, 16, 23, 30 తేదీలలో గువాహటి నుంచి బయలుదేరుతుంది.
సికింద్రాబాద్‌– దర్బంగా: జూలై 3, 7, 10, 14, 17, 21, 24, 28, 31 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి, తిరుగు ప్రయాణంలో జూలై 6, 10, 13, 17, 20, 24, 27, 31 తేదీలలో దర్బంగా నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది.  
కాకినాడ టౌన్‌– రాయ్‌చూర్‌ స్పెషల్‌: మే 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29, 31 తేదీలలో, అలాగే జూన్‌ 5, 7, 12, 14, 19, 21, 26, 28 తేదీలలో కాకినాడ నుంచి మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి. తిరుగు ప్రయాణంలో మే 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీలలో, అలాగే జూన్‌ 1, 6, 8, 13, 15, 20, 22, 27, 29 తేదీలలో రాయ్‌చూర్‌ నుంచి బయలుదేరుతుంది.

మరిన్ని వార్తలు