సిర్పూర్ కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైళ్లు

3 Oct, 2014 00:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక మెమూ రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (07035) మెమూ ట్రైన్ అక్టోబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ట్రైన్ (07036) అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా