'కచ్చా స్పిరిట్ వల్లే చిన్నారుల మృతి'

12 Dec, 2014 20:22 IST|Sakshi

 హైదరాబాద్: జూబ్లీహిల్స్ జవహర్నగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం సంభవించిన  పేలుడు ఘటనకు కచ్చా స్పిరిట్ కారణమని పోలీసులు తెలిపారు. కచ్చా స్పిరిట్ను పొయ్యిలో పోయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో కీర్తివాణి, నర్సమ్మ అనే చిన్నారులు చనిపోగా, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద కారణాలను పోలీసులు తెలిపారు.

ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తల్లి సరస్వతి ఓ స్టూడియోలో పనిచేస్తోంది. పొయ్యి వెలిగించుకునేందుకోసం స్టూడియో నుంచి కచ్చా స్పిరిట్ను ఇంటికి తీసుకువచ్చింది. పెట్రోల్, స్పిరిట్ను కలిపితే కచ్చా స్పిరిట్ అవుతుందని పోలీసులు తెలిపారు. సినిమాల్లో పేలుళ్ల కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఈ రోజు ఉదయం పొయ్యి వెలిగించేందుకు ఈ స్పిరిట్ను వేయగా, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  కీర్తివాణి, నర్సమ్మ చనిపోయారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు