క్రాఫ్‌ బాలేదని విద్యార్థిని చితకబాదారు..

19 Nov, 2015 11:53 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హెయిర్ కటింగ్ (క్రాఫ్) సరిగా లేదన్న కారణంతో విద్యార్థిని ఓ ప్రైవేట్ స్కూల్ ఇన్ చార్జి చితకబాదారు. వెంగళ్‌రావునగర్‌లో నివాసం ఉంటున్న షేక్ హతీక్ ఎస్‌ఆర్ నగర్‌లోని భాష్యం స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. బధవారం హతీక్ స్కూల్‌కు వెళ్లగా.. మిలటరీ కటింగ్ ఎందుకు చేసుకున్నావని ఇన్‌చార్జి శిరీష ప్రశ్నించింది. అంతేకాకుండా రెండు చేతులపై కర్రతో బలంగా బాదడంతో.. విద్యార్థి గాయపడ్డాడు.

బాలుడి తల్లి ఫర్వీన్ సుల్తానా, తమకు సన్నిహితుడైన ఈశ్వర్‌ను అక్కడికి పిలిపించి.. వారితోనూ దురుసుగా మాట్లాడారని బాధిత విద్యార్థి తెలిపాడు. క్రాఫ్ సరిగా చేసుకొని వస్తేనే స్కూల్‌లో అడుగుపెట్టాలని ఇన్‌చార్జి హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీలేక విద్యార్థి మళ్లీ క్రాఫ్ చేయించుకుని వెళ్లాడు. చిన్న కారణానికే విద్యార్థిని కొట్టడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు