ప్రజల కోసం హెల్ప్‌డెస్క్‌లు

29 Oct, 2014 02:43 IST|Sakshi
ప్రజల కోసం హెల్ప్‌డెస్క్‌లు

జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఏర్పాటు: దేవీప్రసాద్

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి తాలూకా, జిల్లా కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన టీఎన్‌జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు తీర్మానించినట్టు టీఎన్‌జీఓ అధ్యక్షుడు జి. దేవీప్రసాద్ అనంతరం విలేకరులకు తెలిపారు. ముందుగా జిల్లా కేంద్రాల్లోని తమ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి, ఆ తరువాత తాలూకా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.

వీటిద్వారా ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడమేగాక, కార్యాలయాల్లో వారి సమస్యలు త్వరగా పరిష్కరించేలా చూస్తామన్నా రు. ఉద్యోగులు అలసత్వాన్ని వీడే లా, పని సంస్కృతిని పెంచేలా చర్యలు చేపడుతామన్నారు. కొన్నిశాఖల్లో రోజుకు అదనంగా 2 గంటలు పనిచేస్తున్నామ ని చెప్పారు.  ఉద్యోగుల విభజన సమస్యలపై వచ్చే నెల 26, 27 తేదీల్లో ఒక రోజు ఛలో ఢిల్లీ నిర్వహిస్తామన్నారు.  
 
విభజన 31లోగా పూర్తిచేయాలి
ఉద్యోగుల విభజనను ఈనెల 31 లోగా పూర్తి చేయాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై  కేంద్ర హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు