స్టార్టప్ పాలసీ పర్యవేక్షణకు కమిటీ

28 Jun, 2016 19:20 IST|Sakshi

సరికొత్త స్టార్టప్ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్ సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ కమిటీలో ఎలక్ట్రానిక్స్‌లోని పలువురు అధికారులను సభ్యులుగా చేర్చింది. ఐటీ విభాగం కార్యదర్శి ప్రద్యుమ్న ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేశారు. రాష్ట్రంలో 100 ఇంక్యుబేటర్స్, 5 వేల స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. ఒక మిలియన్ చదరపు అడుగుల్లో ఇంక్యుబేషన్ అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణం నిపుణుల సలహాలు సూచనలను స్వీకరించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.

 

మరిన్ని వార్తలు