నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ

7 Feb, 2016 04:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతల అప్పగింత అంశం తో పాటు 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించేందుకు మంత్రివర్గం ఆదివారం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. కేబినెట్ ఎజెండా ప్రకారం బడ్జెట్‌పైనే ప్రధానంగా చర్చ జరగనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

శాఖల వారీగా బడ్జెట్ పద్దులతో పాటు త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారుపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజు, గవర్నర్ ప్రసంగించే తేదీని నిర్ణయించనుంది. 1993కు ముందు నుంచి ప్రభుత్వంలో పనిచేస్తున్న 5 వేల మంది తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఆమోదించనుంది.

మరిన్ని వార్తలు