మార్కెట్‌ విలువలను సవరించబోం

14 Mar, 2017 00:25 IST|Sakshi
మార్కెట్‌ విలువలను సవరించబోం

భూములపై హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించబోమని ఉమ్మడి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించకపోవడాన్ని సవాలు చేస్తూ రైతు నాయకుడు కోదండరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై ఏసీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.

‘‘నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రం లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఆదాయం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌ విలువను సవరిం చడం సరికాదు’’ అని తెలిపిం ది. ‘‘రాష్ట్రం లో రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి గణనీయంగా పెరిగింది. కాబట్టి మార్కెట్‌ విలువను సవరించాల్సిన కారణమేదీ కని పించడం లేదు’’ అని వివరించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్‌.మీనా ఈ మేరకు జారీ చేసిన మెమోను ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కె.రామకృష్ణారెడ్డి సోమవారం కోర్టు ముందుంచారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు, మా ర్కెట్‌ విలువలను సవరించ కూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక తామేం చేయగ లమని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

అభ్యంతరాలేమైనా ఉంటే తెలియ జేయాలంటూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూ ర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు