రాష్ట్ర ప్రభుత్వ ‘ఈ-మెయిల్’

21 Jan, 2016 04:44 IST|Sakshi

పాలసీని విడుదల చేసిన ఐటీ శాఖ
అధికారులు ఇకపై ప్రైవేటు
ఈ మెయిల్స్ వాడకూడదు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఈ-మెయిల్ పాలసీని ఐటీ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలతో ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వపరంగా ఇతర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపేటప్పుడు, అధికారుల మధ్య సంప్రదింపులు జరిపేటప్పుడు ప్రైవేటు ఈ-మెయిల్‌ను వినియోగించకుండా ప్రభుత్వ ఈ-మెయిల్‌నే వినియోగించేలా ఈ విధానాన్ని తెచ్చింది. ప్రైవేటు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం పంపడం వల్ల భద్రతా సమస్యలు ఉండటంతో పూర్తి రక్షణ కలిగిన ప్రభుత్వ ఈ-మెయిల్‌ను అనుసరించాలని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్రం ఈ విధానాన్ని తెచ్చింది.

 ఇప్పటివరకు ప్రభుత్వ ఈ-మెయిల్ వ్యవస్థ ఉన్నప్పటికీ అది తప్పనిసరి కాక పోవడంతో అధికారులు, వివిధ శాఖలు జీమెయిల్ వంటి ప్రైవేటు ఈ-మెయిల్‌ను వినియోగిస్తున్నారు. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాల్లో, సంప్రదింపుల్లో ప్రైవేటు ఈ-మెయిల్‌ను వినియోగించడానికి వీల్లేదు. దీని నిర్వహణకు నేషనల్ ఇన్‌ఫార్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుంది. శాఖలు, అధికారుల హోదాను బట్టి ఎన్‌ఐసీ యూజర్ ఐడీని క్రియేట్ చేసి ఇస్తుంది. అధికారులు, మంత్రులకు అధికారిక ఈ-మెయిల్‌తోపాటు కావాలనుకుంటే వ్యక్తిగత ఈ-మెయిల్ అకౌంట్లను ఇస్తారు.

అయితే ప్రభుత్వ, అధికారిక కార్యకలాపాలు, సంప్రదింపులు, ఫైల్ ప్రొసీజర్ అంతా అధికారిక మెయిల్ ద్వారా జరపాలి. డిజిటల్ సంతకంతో కూడిన ఈ-మెయిల్‌ను ఇస్తారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాలి. ఇందులో వన్‌టైమ్ పాస్‌వర్డ్ విధానం ఉంటుంది. యూజర్ వినతిని బట్టి ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసి ఇస్తారు. హోదా వింగ్ శాఖను పేర్కొంటూ  ్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ పేరుతో క్రియేట్ చేసి ఇస్తారు. ఎవరైనా అధికారికి ఇవ్వాలంటే ముందు ఠట్ఛటజీఛీః్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ పేరుతో ఇస్తారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు, పాస్‌వర్డ్ పాలసీ వివరాలు ఠీఠీఠీ.జ్టీ. ్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ/్ఛఝ్చజీఞౌజీఛిడ/జఠజీఛ్ఛీజ్ఛీట  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

మరిన్ని వార్తలు