రాష్ట్రంపై చలి పంజా

12 Dec, 2016 13:50 IST|Sakshi
రాష్ట్రంపై చలి పంజా

- మెదక్‌లో అత్యంత తక్కువగా 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
- మరో రెండ్రోజులు చలి తీవ్రత ఉండే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఉదయం వేళల్లో చలి గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. మరో రెండ్రోజులపాటు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి పూట మేఘాలు కేంద్రీకృతమై ఉంటున్నా.. రాత్రి వేళ సాధారణ పరిస్థితి ఉంటుండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 6 డిగ్రీల వరకు తగ్గారుు. మెదక్, నల్లగొండల్లో 6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గారుు. మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత అత్యంత తక్కువగా 10 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలు నమోదైంది. నగరంలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు తగ్గారుు.

నల్లగొండలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా 21 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా.. 6 డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్, హన్మకొండ, నిజామాబాద్, రామగుండంలలో రాత్రి ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల చొప్పున నమోదయ్యారుు. ఖమ్మంలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత రాత్రి వేళ నమోదైంది. ఉత్తర భారతం నుంచి శీతల గాలులు మొదలైతే చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. అరుుతే అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం ఉండబోదని పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు