'మనూ'లో విద్యార్థి సంఘ ఎన్నికలు వాయిదా

14 Oct, 2015 20:41 IST|Sakshi

మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో గురువారం జరగాల్సిన విద్యార్థి సంఘ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు, ఆఫీసర్లతో ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్ననేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించారు.

ప్రధానంగా వర్శిటీ ప్రొక్టర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ వాహెద్ రాజీనామా చేయడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలిసింది. మరో వైపు గురువారం జరగాల్సిన పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించం కుదరదని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు