సూపర్ ఉమెన్ ఫోర్‌‌స

7 Oct, 2015 01:03 IST|Sakshi
సూపర్ ఉమెన్ ఫోర్‌‌స

సందడిగా ‘శాంతి
భద్రతల పరిరక్షణలో మహిళల పాత్ర’ సదస్సు
{పత్యేక ఆకర్షణగా విదేశీ, భారత మహిళా పోలీసులు

 
రానున్న రోజుల్లో అన్ని దేశాల పోలీస్ వ్యవస్థలో మహిళల సంఖ్య మరింత పెరగాలని పలువురు మహిళా పోలీస్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలోమంగళవారం ‘శాంతిభద్రతల పరిరక్షణలో మహిళల పాత్ర’పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఇందులో విదేశీయులతో పాటు భారతీయ మహిళా పోలీసు అధికారులు పాల్గొన్నారు. పోలీసింగ్, మహిళా పోలీసుల పాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పలువురు విదేశీ మహిళ అధికారులను పలుకరించగా వారు ఇలా స్పందించారు.    - సాక్షి, సిటీబ్యూరో
 
 ఓర్పు ఉండేది మహిళల్లోనే..
 బంగ్లాదేశ్ పోలీసు ఫోర్స్‌లో మహిళల ప్రాతినిథ్యం 20 శాతం కన్నా తక్కువే ఉంది. రానున్న రోజుల్లో వీరి సంఖ్య పెరుగుతుందని అనుకుంటున్నా. ఓర్పు, నేర్పుతో ఉండే మహిళల సంఖ్య పెరిగితే బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వగలం. మహిళలు, పిల్లల బాధితులకు న్యాయం చేసేందుకు ‘విగ్ టీమ్ సపోర్ట్ సెంటర్’ ప్రత్యేకంగా పనిచేస్తోంది. పోలీసు రిఫామ్ ప్రాజెక్టు కింద కూడా మహిళలకు న్యాయం చేసేందుకు మా పోలీసులు పోరాడుతున్నారు.
 - షాహీనా అమీన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, బంగ్లాదేశ్
 
 చిల్డ్రన్-ఉమెన్ బ్యూరోతో సేవలు

 పిల్లలు, మహిళల కోసం మా దేశంలో ప్రత్యేకంగా ‘చిల్డ్రన్ అండ్ ఉమెన్ బ్యూరో’ పనిచేస్తోంది. మొత్తం 36 బృందాల సహాయంతో ఎప్పటికప్పుడు వారి భద్రతను పర్యవేక్షిస్తున్నాం. శ్రీలంక పోలీసు ఫోర్స్‌లోనూ మహిళల ప్రాతినిథ్యం అంతంత మాత్రమే. అయితే ఫిర్యాదుదారులు తమ బాధలను ఎక్కువగా మహిళ పోలీసులకే చెప్పేందుకు ఇష్టపడుతున్నారు.
     - సుమాకుమారి సిన్హా, ఏఎస్పీ, శ్రీలంక
 
 సైన్యంలోనూ మహిళలు..

 మిలట్రీ ఫోర్స్‌లో ఇప్పుడిప్పుడే మహిళల సంఖ్య పెరుగుతోంది. 2011లో అఫ్ఘనిస్థాన్‌లో జరిగిన యుద్ధంలో మా సైనికులు పాల్గొన్నారు. ఇందులో మహిళల పాత్ర మరువలేనిది. ఇప్పటికే మిలట్రీ ఫోర్స్‌లో మహిళల ఇబ్బందులు, వారు పనిచేస్తున్న తీరుపై అధ్యయనం చేశా. మా దేశంలోనూ మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
  - నటాలిక్ శాన్‌బి, మిలట్రీ భద్రతా అధికారిణి, ఆస్ట్రేలియా
 
 బాధితులకు అండగా..
 మా ప్రాంతంలో పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ ఎక్కువగా జరుగుతుంటాయి. బాధితులు ఎక్కువగా విదేశీయులే ఉంటారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలతో పాటు విదేశీయులను టార్గెట్ చేస్తున్న దొంగలను పట్టుకునేందుకు మా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు విభాగం పనితీరుపై పూర్తి అధ్యయనం చేశా. కొంత మంది మహిళా పోలీసులు తాము ఎదుర్కొంటున్న బాధలు కూడా వివరించారు.
 - లియాన్ బ్లి, రీసెర్చ్ స్టూడెంట్, వియత్నాం
 
 

మరిన్ని వార్తలు