సుశీల్‌ను కఠినంగా శిక్షించాలి

7 Mar, 2016 00:26 IST|Sakshi
సుశీల్‌ను కఠినంగా శిక్షించాలి

ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్
 
బంజారాహిల్స్: యువతితో అనుచితంగా ప్రవర్తించిన కేసులో అరెస్టయిన ఏపీ మంత్రి రావెల కిశోర్ కుమారుడు రావెల సుశీల్‌ను కఠినంగా శిక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీ   డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.  సుశీల్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కోరారు.  ఆందోళనలో ఆమ్ ఆద్మీపార్టీ రాష్ట్ర కన్వీనర్ వెంకట్‌రెడ్డి, నమ్రతా జైస్వాల్, బుర్రా రాములుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
 
అండగా ఉంటాం: టీవైఎస్సార్‌సీపీ మహిళా విభాగం
బంజారాహిల్స్/నల్లకుంట: ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు రావెల సుశీల్ అనుచిత వైఖరితో పరువుప్రతిష్టలకు భంగం కలిగిన ఫాతిమా బేగంను తెలంగాణ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు బం డారు పద్మ, వరలక్ష్మి, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి క్రిస్టోలైట్ తదితరులు ఆదివారం పరామర్శించారు. ఆ రోజు జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అండగా ఉం టామని ప్రకటించారు. సుశీల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి నష్టపరిహారం అందజేయాలన్నారు.
 
నిందితుడిని రక్షించేందుకు యత్నం...
అనంతరం క్రిస్టోలైట్, బండారు పద్మలు బంజారాహిల్స్ ఠాణాకు వెళ్లి రావెల్ సుశీల్‌కుమార్‌పై నమోదు చేసిన కేసుల సెక్షన్లలపై ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణను ఆరా తీశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిందితుడు సుశీల్‌పై 363, 506, 504, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు మొక్కుబడిగా 354 డి, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, నిందితుడిని రక్షించేం దుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయకుంటే వైఎస్సార్‌సీపీ తరపున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.
 

>
మరిన్ని వార్తలు