లొసుగుల వల్లే ప్రధానికి లొంగుతున్నారు

21 Dec, 2016 00:11 IST|Sakshi
లొసుగుల వల్లే ప్రధానికి లొంగుతున్నారు

చంద్రబాబు, కేసీఆర్‌పై సురవరం ఆరోపణ

- రాజకీయ అభద్రతతో ఉన్నందునే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజం
- రెండున్నరేళ్ల పాలనలో హామీల అమల్లో ఘోర వైఫల్యమని మండిపాటు
- నేటి నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ భేటీ సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ 


సాక్షి, హైదరాబాద్‌: లొసుగులు ఉన్నందు వల్లే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వా నికి లొంగిపోతున్నారని సీపీఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీల అమల్లో వైఫల్యాలతో పాటు వారి ఇతర బలహీనతలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌మెయిల్‌ చేస్తోందా లేదా వారే లొంగి పోతున్నారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. బాబు, కేసీఆర్‌ రాజకీయ అభద్రతాభావంతో ఉన్నారని, అందువల్లే ప్రతిపక్షాలు లేకుండా చేయాలని విపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కానీ వారి తో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారన్నారు.  బుధవా రం నుంచి శుక్రవారం వరకు నగరంలో జరగ నున్న సీపీఐ జాతీయ, కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా సురవరం సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...

రెండున్నరేళ్ల పాలనలో ఇద్దరిదీ ఘోర వైఫల్యం..
‘చంద్రబాబు, కేసీఆర్‌ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకిచ్చిన హామీల్లో ప్రధానమైనవి అమలు కాలేదు. రైతు రుణాల రద్దు సహా ఇతర హామీ ల అమల్లో చంద్రబాబు ఘోరంగా విఫలమవ్వ గా దళితులకు మూడెకరాల భూపంపిణీ, పేద లకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇంటింటికీ మంచి నీటి సరఫరా తదితర హామీల్లో ఒక్కశాతం కూడా కేసీఆర్‌ అమలు చేయలేదు. వైఫల్యా లను కప్పిపుచ్చుకునేందుకు పూజలు, పండు గలు, పబ్బాలు అంటూ ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి కొందరు వ్యక్తులు రాజుకు మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్‌ ఆ కోవకు చెందినవారే. బీజేపీతో స్నేహం భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే నగదురహిత లావాదే వీలు, డిజిటలైజేషన్‌ అంటూ చంద్రబాబు, కేసీఆర్‌ హడావుడి చేస్తున్నారు. దీని సాధ్యాసా ధ్యాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తు న్నారు. చుట్టూ వందిమాగధులు చేరి పొగడ్త లతో ముంచెత్తుతుండడంతో బాబు, కేసీఆర్‌ లకు రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదు.

నయీం కేసే కేసీఆర్‌ అవగాహనకు కొలబద్ధ..
నయీం కేసును సీబీఐకు ఇచ్చేందుకు నిరాకరిం చడం ద్వారా కేసీఆర్‌ అవగాహనను కొలబద్ధ గా అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో ఎవరినీ వదలం అని చెప్పినా... తప్పు చేసిన వారు తమ పార్టీలో ఉంటే వారికి రక్షణ, లేని వారికి శిక్షణ అన్నట్లుగా విచారణకు నిరాకరిస్తున్నారు.

పార్లమెంటు స్తంభన వారి వ్యూహరచనే...
పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకుం డా కేంద్రం, బీజేపీ వ్యూహం పన్నాయి. బీజేపీ అగ్రనేత అద్వానీ అదే ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో మెజారిటీ ఉన్నా బీజేపీ కీలకాంశా లపై ఎందుకు చర్చించలేదు?’ అని అన్నారు.

పెద్ద నోట్ల రద్దు అత్యంత తెలివితక్కువ నిర్ణయం...
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అత్యంత తెలివి తక్కువది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ కుండా ఈ నిర్ణయం తీసుకోవడం అర్థరహి తం. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు పక్కకుపోయి నగదు రహిత లావాదేవీలు, డిజిటలైజేషన్‌ అంటూ కొత్త పాట అందుకున్నారు. ఇది దేశ, కాల పరిస్థితులకు అనువైనది కాదు. ఈ నిర్ణయం వల్ల ఆశించిన మేర నల్లధనం బయటకు రాలేదు. దాచుకున్న డబ్బే బ్యాంకులకు వచ్చింది, దోచుకున్న డబ్బు మార్పిడి అయ్యిందనేది మా అంచనా. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. కొంతైనా కోలుకునేందుకు, నోట్ల కష్టాలు కొంచెమైనా తీరేందుకు కనీసం 5, 6 నెలలు పట్టొచ్చు.

సురవరంతో గద్దర్‌ భేటీ 



సురవరంతో ప్రజా గాయకుడు గద్దర్‌ సమావేశమయ్యారు. మంగళవారం మగ్దూం భవన్‌కు వచ్చిన ఆయన సురవరం తో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరు, ప్రజా సమస్య లపై ప్రభుత్వం స్పంది స్తున్న తీరు తదితర అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమా వేశంలో సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండటంతో సురవరంను అభినందిం చేందుకే వచ్చానని, తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని గద్దర్‌  తెలిపారు.

మరిన్ని వార్తలు