ముందు ఏపీలో జీవో తీసుకురండి

18 Jan, 2017 03:25 IST|Sakshi
ముందు ఏపీలో జీవో తీసుకురండి

ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహణపై మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ లాబీలో మంత్రి తలసాని, టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎన్టీఆర్‌ వర్ధంతిని అధికారికంగా నిర్వహించి విశ్వసనీయతను చాటుకోవాల్సిన సమయం వచ్చిందని తలసానిని ఉద్దేశించి సండ్ర వ్యాఖ్యానించగా.. ‘ఎన్టీఆర్‌ వర్ధంతిని అధికారికంగా జరిపేందుకు ముందు ఏపీలో జీవో తీసుకురండి, తర్వాత ఇక్కడ ఆలోచిద్దాం’ అని తలసాని అన్నారు.

దీంతో కార్యక్రమానికి జీవోలుండవని, మౌఖిక ఆదేశాలు మాత్రమే ఉంటాయని రేవంత్‌ జవాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వర్ధంతిని అధికారికంగా నిర్వహించారని, ఇప్పుడు ఏపీలోనూ నిర్వహిస్తున్నారని వివరించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు