నిరసన పదం వింటే సర్కార్‌కు భయం

16 Jul, 2017 01:29 IST|Sakshi
నిరసన పదం వింటే సర్కార్‌కు భయం

ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ సెమినార్‌లో తమ్మినేని
ప్రభుత్వంలో చలనం లేదు: కోదండరాం


సాక్షి, హైదరాబాద్‌: నిరసన అనే పదం వింటే నే తెలంగాణ ప్రభుత్వం భయపడు తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ పరి రక్షణ కోసం ఈ నెల 22న ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద తెలిపే నిరసనకు దేశవ్యాప్త మద్దతు కూడగట్టాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణలో పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ నేతృత్వంలో ‘పౌరహక్కులు–నిర్బంధం’ అం శంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లా డారు. కమిటీ కన్వీనర్‌ చాడ వెంకట్‌రెడ్డి, కో–కన్వీనర్‌ విశ్వేశ్వర్‌రావు, విరసం నేత వరవరరావు, టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సమాజహితం కోరుకునే మేధావులను గౌర వించుకోవడం అందరి బాధ్యతని, కానీ, దానికి పూర్తి విరుద్ధంగా రాష్ట్ర పాలకులు వ్యవ హరిస్తున్నారని తమ్మినేని విమర్శించారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా స్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, దేశం లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పాలన సాగుతోందన్నారు. ధర్నాచౌక్‌ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. కేసీఆర్‌ సామ్రాజ్యవాద ఏజెంట్‌ మాదిరిగా పనిచేస్తు న్నారని వరవరరావు ఆరోపించారు. ప్రజల హక్కులు హరిస్తున్నారని, సమస్యలను చెప్పు కునే అవకాశం లేకుండా చేశారన్నారు.

ఢిల్లీలో ధర్నాచౌక్‌గా జంతర్‌మంతర్‌ కొనసాగుతోంది కానీ, ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను ఫాసిస్టు పద్ధతిలో కేసీఆర్‌ రద్దు చేశారన్నారు. ఎన్ని విధాలుగా నిరసన తెలిపినా ప్రభుత్వం లో చలనం రాకపోవడం బాధాకరమని కోదండరాం అన్నారు. ధర్నాచౌక్‌ ఎత్తివేయ డంవల్ల సమస్యలు సమసిపోతాయనుకోవ డం సరికాదని, ధర్నాచౌక్‌గా ప్రగతిభవన్‌ ఎప్పుడో అయిపోయిందని చెప్పారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరిదని, జాతీయ స్థాయిలో మద్దతు కోసం అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళతామన్నారు. రియల్‌ఎస్టేట్‌ కోణంలో మాత్రమే సచివాల యం తరలింపు జరుగుతోందని, దీన్ని అంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు.

మరిన్ని వార్తలు