మురుగు ముప్పు తప్పాలంటే..

12 Dec, 2016 14:49 IST|Sakshi
మురుగు ముప్పు తప్పాలంటే..

పైపులైన్లు మారిస్తేనే ‘సాగర్’ శుద్ధి
కూకట్‌పల్లి, సికింద్రాబాద్ నాలా పైపులైన్ మారిస్తేనే ప్రయోజనం
అప్పటివరకు హుస్సేన్‌సాగర్‌లోకి యథేచ్ఛగా మురుగు ప్రవాహం
రూ.376.13 కోట్ల ఆర్థిక సహాయం కోరుతూ కేంద్రానికి వినతి

సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌కు మురుగు, పారిశ్రామిక వ్యర్థజలాల నుంచి విముక్తికి కూకట్‌పల్లి, సికింద్రాబాద్ నాలా పైపులైన్ మారిస్తేనే ప్రయోజనమని జలమండలి పరిశీలనలో తేలింది. ఈ నాలకు సంబంధించిన కె అండ్ ఎస్ మెరుున్(కూకట్‌పల్లి, సికింద్రాబాద్ మెరుున్)ను 18.25 కిలోమీటర్ల మేర తక్షణం మార్చి కొత్త పైపులైన్ వేస్తేనే ప్రయోజనమని తేల్చింది. ఇందుకు రూ.261 కోట్లు అంచనా వ్యయం అవుతుందని నిర్ణరుుంచింది. లేనిపక్షంలో సాగర్‌కు మురుగు ముప్పు తప్పదని భావిస్తోంది. దీంతోపాటు నగరంలో ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న పైపులైన్లు, భవనాలు, మ్యాన్‌హోళ్లను పునరుద్ధరించేందుకు మొత్తంగా రూ.376.13 కోట్ల మేర నిధులు అవసరమని.. ఈ మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందజేయాలని ఇటీవల నగరానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందానికి నివేదించింది.

 ఇదీ పరిస్థితి..
కూకట్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి రోజువారీగా సుమారు 450 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు వెలువడుతారుు. ఈ జలాలు కె అండ్ ఎస్ మెరుున్ ద్వారా హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న మారియెట్ హోటల్ వరకు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్ ద్వారా మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి మూసీలోకి వదిలిపెడుతున్నారు. ఈ పైపులైన్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో సర్‌ప్లస్ నాలా నుంచి నిత్యం పారిశ్రామిక వ్యర్థజలాలు హుస్సేన్‌సాగర్‌లోకి చేరుతుండడంతో సాగర్‌కు మురుగు నుంచి విముక్తి లభించడంలేదు. మరోవైపు అమీర్‌పేట్ దివ్యశక్తి అపార్ట్‌మెంట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న ‘ఏ’ మెరుున్ భారీ మురుగునీటి పైపులైన్ కూడా ఇటీవలి భారీ వర్షాలకు ఎన్టీఆర్ గార్డెన్ వద్ద దెబ్బతినడంతో ఈ పైపులైన్ ద్వారా పారే మురుగు నీటిని కూడా సాగర్‌లోకి మళ్లిస్తున్నట్లు తెలిసింది. దీంతో సాగర్‌కు కష్టాలు తప్పడంలేదు. ఈనేపథ్యంలో కెఅండ్‌ఎస్ మెరుున్ పైపులైన్‌తోపాటు ఏ మెరుున్ పైపులైన్లను మార్చేందుకు ఆర్థిక సహాయం అందజేయాలని జలమండలి కేంద్ర బృందానికి సమర్పించిన నివేదికలో కోరింది.

మరిన్ని వార్తలు