పబ్లపై దాడి, యువతీ, యువకుల అరెస్ట్

1 Jan, 2015 08:10 IST|Sakshi
ఫైల్ ఫోటో

హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు పబ్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పబ్ నిర్వహకులతో పాటు పలువురు యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు. సమయం మించి పబ్లు నిర్వహిస్తున్న సందర్భంగా టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. కాగా న్యూ ఇయర్‌ సందర్భంగా పబ్లకు ఒంటిగంట వరకే అనుమతి ఇవ్వగా, నిర్వాహకులు మాత్రం తెల్లవారుజాము వరకూ పబ్లను నిర్వహించటం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు నూతన సంవత్సర వేడుకల్లో కూడా డ్రంకన్‌ డ్రైవ్ తప్పలేదు. హైదరాబాద్‌లో అర్థరాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. 400మందిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్‌ చేశారు.

న్యూ ఇయర్ వేడుకల్లో నిబందనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మద్యం తాగి ఎవ్వరూ డ్రైవింగ్ చేయరాదని, ట్రిపుల్‌ రైడింగ్‌కు పాల్పడినా దండన తప్పదని హెచ్చరించారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్‌ పోలీసులు ఒంటిగంట తర్వాత డ్రైంకన్‌ డ్రైవ్ చేపట్టారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు