అదే ఎదురుదాడి!

9 Mar, 2016 15:28 IST|Sakshi
అదే ఎదురుదాడి!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ సభ్యులు బుధవారం మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో వైఎస్ జగన్ రెడ్డి మాట్లాడుతుండగా పదేపదే అడ్డు తగిలారు. విపక్ష నేతపై వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగారు.

వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా గందరగోళం సృష్టించారు. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ తో అబద్దాలు చెప్పించారని విపక్ష నేత ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ నేతల భూదందా గురించి జగన్ ప్రస్తావించినప్పుడు టీడీపీ సభ్యులు సభలో ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఎదురుదాడికి దిగారు.

మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, కాల్వ శ్రీనివాసులు, బొండా ఉమామహేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు తదితరులు మధ్యలో లేచి మాట్లాడారు. వైఎస్ జగన్ పై గోరంట్ల బుచ్చియ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనను స్పీకర్ మందలించారు.

మరిన్ని వార్తలు