నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోతున్నా

22 May, 2015 12:52 IST|Sakshi
నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోతున్నా

హైదరాబాద్ : ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న శ్రీమంతుడు చిత్రంలో తనకు ఛాన్స్ రావడం పట్ల హైదరాబాదీ అమ్మాయి తేజస్వీ మాదివాడ ఉబ్బితబ్బిబవుతోంది. ఇప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఆమె నటించిన సంగతి తెలిసిందే. మహేశ్తో కలసి నటించడం చాలా ఆనందంగా ఉంటుందని తేజస్వి చెప్పింది. నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోతున్నానంటుంది.


సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టులో వలేనే శ్రీమంతుడు చిత్రంలో కూడా చిన్న పాత్రే ... కాకుంటే చాలా ఆసక్తితో కూడిన పాత్ర అని తేజస్వి వెల్లడించింది. ఇంతకీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించిన తేజస్వీ గుర్తుందా ?  లేదా అయితే... ఆ చిత్రంలో మహేశ్ బాబు విజయవాడ వాళ్ల వివాహానికి వెళ్తాడు... అక్కడ మహేశ్ బాబును భోజనానికి తీసుకు వెళ్తుంది కదా ఆ అమ్మాయే.

ఇంకా గుర్తు రాలేదా?  నాకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ... ఈ మధ్య సపరేట్ బ్యాచ్ని కూడా మెయింటేన్ చేస్తున్నా అంటూ మహేశ్ బాబుతో చెప్పే అమ్మాయి. ఇప్పుడు గుర్తుకు వచ్చే ఉంటుంది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు