తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రారంభం

15 May, 2016 09:59 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2016 ఇంజినీరింగ్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షకు మొత్తం 276 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. వీటికి అదనంగా ఆన్ లైన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హైదరాబాద్లో మూడు, వరంగల్లో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

1,43,524 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్ష రాయనున్నారు. ఇంజినీరింగ్‌ సెట్‌ కోడ్ 'క్యూ' ప్రశ్నాపత్రాన్ని ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎంపిక చేశారు. తొలిసారిగా బయో మోట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. నిమిషం నిబంధనను అధికారులు పటిష్టంగా అమలుజేశారు. పలు సెంటర్లలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు పరీక్ష సెంటర్లలోనికి అనుమతించలేదు.

కూకట్పల్లి జేఎన్టీయూలో కల్యాణ్ అనే విద్యార్థి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. దీంతో అధికారులు అతన్ని పరీక్షకు అనుమతించపోవడంతో వెనుదిరిగాడు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మెడికల్, అగ్రికల్చర్ పరీక్ష జరగనుంది.
 

మరిన్ని వార్తలు