-

వారసులకు పది రోజుల్లో ఉద్యోగం

26 Dec, 2016 02:00 IST|Sakshi

కారుణ్య నియామకాలపై సర్కారు స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌:
ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి వారసులకు ఉద్యోగమిచ్చే కారుణ్య నియామక పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలపై మరోసారి స్పష్టతనిచ్చింది. మరణించిన ఉద్యోగుల వారసులు దరఖాస్తు చేసు కున్న 10 రోజుల్లో ఈ నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

దరఖాస్తు తేదీ నుంచి పది పనిదినాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. వివిధ శాఖల పరిధిలో ఉన్న ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కుటుంబ దిక్కును కోల్పోయి దుఃఖంలో ఉండే బాధితులకు తక్షణ సాయం అందేందుకు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర అన్ని శాఖలకు సర్క్యులర్‌ జారీ చేశారు.

మరిన్ని వార్తలు