'తెలంగాణ దూసుకెళుతోంది'

10 Mar, 2016 11:14 IST|Sakshi
'తెలంగాణ దూసుకెళుతోంది'

హైదరాబాద్: ఎన్నో ఆశల మధ్య తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. గురువారం ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఆయన ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. 21 నెలలుగా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేపట్టి అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని అన్నారు. తాజాగా గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో తెలంగాణ చరిత్రాత్మక ఒప్పందం చేసుకుందని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. డబుల్ బెడ్ రూం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి గొప్ప పథకాలు అమలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపట్ల జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి చూపుతోందని అన్నారు. హైదరాబాద్లో 4 కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. శిశు మరణాల రేటు తగ్గింపునకు కృషి చేస్తోందని అన్నారు.

ఇంకా ఏమన్నారంటే...

  • 2026నాటికి రోజుకు ఇంటికి 100 లీటర్ల మంచి నీరు లక్ష్యం
  • మిషన్ భగీరధకు అధిక ప్రాధాన్యం ఉంటుంది
  • ప్రతి ఇంటికి నీటి కుళాయి ఏర్పాటు
  • వ్యవసాయానికి రోజుకు 9గంటల ఉచిత విద్యుత్
  • కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం
  • టీఎస్ ఐపాస్ తో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు
  • సింగిల్ విండోతో వేగంగా పరిశ్రమలకు అనుమతులు.. ఏర్పాటు
  • కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి
  • గచ్చిబౌలిలో టీహబ్తో యువతకు లబ్ధి
  • రాష్ట్రంలో 11.7శాతం వృద్ధి రేటు
  • రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్
  • విద్యుత్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత
  • సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చినట్లుగానే కాలేజీలకు కూడా
  • టెక్స్ టైల్ హబ్ గా వరంగల్ అభివృద్ధి
  • అన్ని జిల్లా కేంద్రాలకు నాలుగు లేన్ల రోడ్ల ఏర్పాటు
  • షీ టీమ్స్ తో ఈవ్ టీజింగ్ కు కళ్లెం... మొత్తంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది.

>
మరిన్ని వార్తలు