త్వరలో వెటర్నరీ వర్సిటీకి ఐకార్ గుర్తింపు!

14 Sep, 2016 03:35 IST|Sakshi

నేటి నుంచి ఐకార్ బృందం తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: పీవీ నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఐకార్ ఉన్నత స్థాయి బృందం బుధవారం హైదరాబాద్ రానుంది. వర్సిటీతో పాటు దాని పరిధిలోని పశు వైద్య కళాశాలలకు వెళ్లి మౌలిక సదుపాయాలపై తనిఖీలు చేయనుంది.

వర్సిటీ పరిధిలో పశు విద్య, మౌలిక సదుపాయాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందితే ఐకార్ గుర్తింపు లభిస్తుంది. ఈ మేరకు అధికారులు అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిసింది. ఈ బృందంలో బెనారస్ విశ్వవిద్యాలయానికి చెందిన డీన్ డాక్టర్ రమాదేవి సహా ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరు ఈ నెల 18 వరకు పర్యటించి సమగ్రంగా అధ్యయనం చేస్తారు.

మరిన్ని వార్తలు