మరో మూడు రోజులు వడగాడ్పులే

26 Apr, 2016 02:35 IST|Sakshi
మరో మూడు రోజులు వడగాడ్పులే

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో 3 రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం రామగుండంలో 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 44.6, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 44.2, ఖమ్మంలో 43.6 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌లో 42.8 డిగ్రీలు నమోదైంది.
 
ఉచిత హోమియో మందు: ఆయుష్ కమిషనర్

వడదెబ్బ నివారణకు హోమియో మందును రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అందజేయాలని ఆయుష్ కమిషనర్ ఎ.రాజేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రామంతాపూర్ హోమియోపతి మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సోమవారం ఏకీకృత రక్త పరీక్షల కేంద్రాన్ని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ రక్త పరీక్షల కేంద్రానికి వచ్చే రోగులకు ఉచితంగా అన్ని రకాల పరీక్షలు చేస్తామన్నారు.
 
వడదెబ్బకు 58 మంది మృత్యువాత

తెలంగాణ జిల్లాల్లో సోమవారం వడదెబ్బతో 57 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 15 మంది.. వరంగల్ జిల్లాలో 13 మంది, ఖమ్మంలో 13 మంది చనిపోయారు. అలాగే, కరీంనగర్‌లో 10 మంది, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మరణించారు.  అలాగే నగరంలోని ఎర్రగడ్డ యునానీ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని 30 ఏళ్ల వ్యక్తి వడదెబ్బకు మృతి చెందాడు.
 
సోమవారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
 ప్రాంతం           ఉష్ణోగ్రత
 రామగుండం    45.0
 నిజామాబాద్    44.6
 ఆదిలాబాద్    44.3
 మహబూబ్‌నగర్    44.2
 నల్లగొండ    44.2
 ఖమ్మం    43.6
 మెదక్    43.5
 హైదరాబాద్    42.8
 హన్మకొండ    42.5

మరిన్ని వార్తలు