వెలగపూడిలో 3 నుంచి పూర్తి స్థాయి విధులు

28 Sep, 2016 04:48 IST|Sakshi

* భవనాలు, అంతస్తులు, గదుల వారీగా శాఖలకు కేటాయింపు
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్/అమరావతి: ఏళ్ల తరబడి హైదరాబాద్ సచివాలయంతో పెనవేసుకున్న అనుబంధం వచ్చే నెల 3వ తేదీ నుంచి తెగిపోతోంది. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. ఇన్నేళ్ల నుంచి హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తూ వెలగపూడి సచివాలయంలో పనిచేసేందుకు వెళ్లిపోతున్న ఉద్యోగులు.. ఇందులో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు.

అక్టోబర్ 3 నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పూర్తి స్థాయి విధులు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ జీవో జారీ చేశారు. ఈ జీవోతోపాటు వెలగపూడి సచివాలయ భవనాల్లో శాఖల వారీగా గదులను అధికారులకు కేటాయించారు. వివరాలివీ..
 
ఒకటో భవనం గ్రౌండ్ ఫ్లోర్: సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులు
 
రెండో భవనం గ్రౌండ్ ఫ్లోర్: మున్సిపల్, హోం, ఇంధన-మౌలిక వసతులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల శాఖ అధికారులు, ఉద్యోగులు
 
రెండో భవనం తొలి అంతస్తు: ఆర్థిక, ప్రణాళికా శాఖల అధికారులు, ఉద్యోగులు
 
మూడో భవనం గ్రౌండ్ ఫ్లోర్:
టెలికం, ప్లే స్కూలు, మీ-సేవ, పోస్టాఫీస్, బ్యాంకు, డిస్పెన్సరీ, అసోసియేషన్స్, ఐటీ డేటా సెంటర్, ఎన్‌ఐసీ, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, ఏపీటీఎస్, లైబ్రరీలు
 
మూడో భవనం తొలి అంతస్తు: బీసీ, మైనార్టీ, సాంఘిక, గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ, యువజన సర్వీసు శాఖల అధికారులు, ఉద్యోగులు
 
నాల్గో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వ్యవసాయ, పశుసంవర్థక, అటవీ పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులు, ఉద్యోగులు
 
నాల్గో భవనం తొలి అంతస్తు: ఉన్నత విద్య, ఐటీ, మాధ్యమిక విద్య, జలవనరులు, ఆర్‌ఎస్‌ఏడీ శాఖల అధికారులు, ఉద్యోగులు
 
ఐదో భవనం గ్రౌండ్ ఫ్లోర్:
వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, కార్మిక, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖల అధికారులు, ఉద్యోగులు
 
ఐదో భవనం తొలి అంతస్తు: రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, డిప్యూటీ పే అండ్ అకౌంట్ ఆఫీస్ అధికారులు, ఉద్యోగులు

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా