టెన్త్ పరీక్షలకు హాల్ టికెట్లు జారీ

15 Mar, 2016 02:16 IST|Sakshi

వెబ్‌సైట్‌నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

 సాక్షి, హైదరాబాద్: ఈనెల 21నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ పూర్తి చేశామని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ హాల్‌టికెట్లను ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈఏపీ.ఓఆర్‌జీ’’ వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. బోర్డు జారీచేసిన హాల్‌టికెట్లు అందకపోయినా, వాటిని పోగొట్టుకున్నా విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌నుంచి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై పాఠశాల ప్రధానోపాధ్యాయునితో అటెస్టెడ్ చేయించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు