వడ్డీ వ్యాపారి దారుణ హత్య

22 Sep, 2015 10:20 IST|Sakshi

వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండ స్వరాజ్య నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసే సోమసుందర్‌ను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. వ్యాపారంలో విభేదాలు రావడంతో భాగస్వామే ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు