ఆరు నెలలుగా కమిషనర్‌ పోస్టు ఖాళీ

15 May, 2017 02:32 IST|Sakshi

- ఐదు బాధ్యతలకు ఒకే జేటీసీ
- ఖాళీల భర్తీకి డీపీసీ ఊసే లేదు
- వాహనదారుల ఫిర్యాదులను పట్టించుకునేవారే ఉండరు
- అస్తవ్యస్తంగా రవాణా కార్యాలయాలు  


సాక్షి, హైదరాబాద్‌: అక్కడ లైసెన్సులకు వాడే పీవీసీ కార్డుల కొరత ఉంటుంది.. కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లో పూర్తిస్థాయి రవాణా కార్యాలయాలు రూపుదిద్దుకోలేదు.. ఆరేళ్ల క్రితం కొన్న కంప్యూటర్లు తరచూ మోరాయి స్తుంటాయి.. తరచూ సర్వర్‌ సమస్యలు..  ఒకేచోట ఏళ్లపాటు పాత కుపోయిన సిబ్బం దిపై అవినీతి ఆరోపణలు.. ప్రస్తుతం రవాణా శాఖలో నెలకొన్న అస్తవ్యస్తం ఇది. ఈ సమస్యలను ఎప్పటి కప్పుడు చక్కదిద్దాల్సిన కమిషనర్‌ పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది. ఇటీవల సీనియర్‌ జేటీసీ పదవీ విర మణ చేసినా ఇప్పటి వరకు శాఖాపర పదో న్నతి కమిటీ(డీపీసీ) ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు చేరలేదు. రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయవనరుగా ఉండటంతోపాటు నిత్యం వాహనదారుల కార్య కలాపాలతో ముడిపడ్డ రవాణాశాఖ గందరగోళంగా మారింది.

సమస్యల వలయంలో రవాణా శాఖ
రాష్ట్ర విభజనకు పూర్వం రవాణాశాఖ కమిషనర్, ఓ అదనపు కమిషనర్, ఐదుగురు జేటీసీలతో హడావుడిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఒకే జేటీసీ విధులు నిర్వర్తిస్తున్నారు. కమిషనర్‌ లేకపోవటంతో రవాణాశాఖ ముఖ్య కార్య దర్శి సునీల్‌శర్మే అదనపు బాధ్యతలు చూసు ్తన్నారు. ఆయనకు మరో కీలకమైన రోడ్లు భవ నాల శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్య త కూడా ఉండటంతో ఆయన పూర్తి స్థాయిలో రవాణా శాఖకు సమయం కేటాయించ లేకపోతు న్నారు. దీంతో ప్రధాన కార్యాలయం అస్తవ్య స్తంగా తయారైంది. తమకు ఫర్నిచర్‌ లేదని కొన్ని కార్యాలయాలు, కంప్యూటర్లు మొరా యిస్తున్నాయని కొన్నిచోట్ల, లైసెన్సుల జారీకి కార్డుల సరఫరా సక్రమంగా లేదని, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్ల సరఫరా గం దరగోళంగా ఉందని, భవనాలు లేక ఇబ్బం దిగా ఉందని.. ఇలా నిత్యం వచ్చే ఫిర్యాదుల ను పరిష్కరించటం ఇబ్బందిగా మారింది.

పడకేసిన విజిలెన్స్‌
విజిలెన్సు దాదాపు పడకేసింది. రవాణా కార్యాలయాల్లో అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది.  ప్రధాన కార్యాలయంలో ఉన్న ఏకైక జేటీసీ రఘునాథ్‌ ఐటీ, పరిపాలన, విజిలెన్సు, లీగల్, ప్లానింగ్‌.. ఇలా అన్నింటిని చక్కదిద్దాల్సి వస్తోంది. వెంటనే మరో జేటీసీని ఇవ్వాలంటే పదోన్నతులు కల్పించాల్సి ఉంది. కానీ డీపీసీ ప్రతిపాదనే ప్రభుత్వం ముందుకు వెళ్లలేదు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధి మరో సీనియర్‌ జేటీసీ పాండు రంగనాయక్‌ బాధ్యతలు చూస్తున్నారు. కొత్త జిల్లాలతో పని ఒత్తిడి పెరిగింది. కమిషనర్, అదనపు కమిషనర్, ఇద్దరు జేటీసీలు ప్రధాన కార్యాలయంలో అవసరం. లారీలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య పర్మిట్‌ వ్యవహారం లాంటి అంశాలను పర్యవేక్షించటం కూడా కష్టంగా మారింది.

మరిన్ని వార్తలు