ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

18 Feb, 2017 00:53 IST|Sakshi
ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహణ
ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.విజయరాజు   


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో (కంప్యూటర్‌ ఆధారితంగా) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ జి.విజయరాజు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ పి.నరసింహారావు, సెట్ల ప్రత్యేకాధికారి డాక్టర్‌ కె.రఘునాథ్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఖరారు చేశామని, కొన్నిటి నోటిఫికేషన్లు విడుదల య్యాయన్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందన్నారు.

ఎంసెట్‌ పరీక్ష 5 రోజులు జరగనున్నందున నార్మలైజేషన్‌ చేసి ప్రశ్నలు ఇవ్వనున్నామన్నారు.  విద్యార్థి పరీక్ష సమాధానాలను ఎన్నిసార్లయినా ఆలోచించుకొని మార్పులు చేసుకోవచ్చన్నారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత ఆయా సమాధానాలు ఆటో మేటిగ్గా సబ్మిట్‌ అవుతాయన్నారు. కరెక్టు కీ సమాధానాలను వారి ఈ మెయిళ్లకు పంపించడంతో పాటు వెబ్‌సైట్‌లోకూడా పెడతామని చెప్పారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా జరిగేందుకు ఆన్‌లైన్‌ విధానం దోహదపడుతుందని చెప్పారు. సెట్ల షెడ్యూళ్లను వెబ్‌సైట్ల వివరాలను  చైర్మన్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు