కొత్తా జిల్లాలండి..!

8 Jun, 2016 23:38 IST|Sakshi
కొత్తా జిల్లాలండి..!

మహానగరంలో రెండు,      ప్రాంతాలతో  మరొకటి
పెరగనున్న రెవెన్యూ   డివిజన్లు, మండలాలు
కలెక్టర్లతో సమీక్ష తర్వాత ప్రకటన!

 

సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. జంట జిల్లాల్లో తొలి నుంచి నెలకొన్న జిల్లాల విభజన గందరగోళానికి సిటీలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల వర్క్ షాపులో కొంత స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ సదస్సులో జంట జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా జిల్లాల పునర్వవ్యస్థీకరణ కసరత్తును సీసీఎల్‌ఏ పూర్తి చేసినట్టు తెలిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఉనికి, రూపు రేఖలు, చారిత్రక ప్రాధాన్యత దెబ్బతినకుండా జంట జిల్లాలను మూడు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జంట జిల్లాల్లో కొత్తగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి (వికారాబాద్ కేంద్రం)  జిల్లాలు ఆవిర్భవించే అవకాశముంది. అదే విధంగా జంట జిల్లాలో కొత్తగా మూడు రెవెన్యూ డివిజన్లు, 10 మండలాలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 20 మండలాలు, సికింద్రాబాద్ జిల్లా పరిధిలో 23 మండలాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 20 మండలాలు ఉండనున్నట్టు తెలుస్తోది. రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ కేంద్రంగా గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేయనున్నారు.


త్వరలో జరుగనున్న అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని మండలాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. అధికారుల నివేదిక ఆధారంగా ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలకు సంబంధించిన అంశాలపై జంట జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత మళ్లీ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

 

 

మరిన్ని వార్తలు