నేర రహిత సమాజమే ధ్యేయం

8 Aug, 2016 21:05 IST|Sakshi
జాబ్‌మేళాలో ప్రసంగిస్తున్న కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి

► నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి

చాదర్‌ఘాట్‌: నేర రహిత సమాజ స్థాపనే పోలీసుల లక్ష్యమని నగర పోలీస్‌ కమిషనర్‌ ఎం.మహేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఈస్ట్‌ జోన్‌ పోలీ సుల ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్‌ ఇంపీరియల్‌ గార్డెన్‌లో మెగా జాబ్‌ మేళా ఏర్పాటు చేశారు. నగర కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి ఈ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.  ఉద్యోగం దక్కించుకోవటం మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుం దని, దీనిని దృష్టిలో పెట్టుకొని యువత తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు యత్నించాలని కమిషనర్‌ సూచిం చారు.  ప్రైవేట్‌ మార్కెట్‌లో వచ్చిన మార్పుల వల్ల జాబ్‌ల సంఖ్య బాగా పెరిగిందని, యువత మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో స్థిరపడాలని అన్నారు. సహనం, ఓర్పుతో అడుగులు వేస్తూ యువత లక్ష్యాలు చేరుకోవాలి తప్ప నేరమార్గంలో పయనించరాదన్నారు.

 

యువతలో సాఫ్ట్‌ స్కిల్స్‌ పెంపొందితే దేశ సంపద వృద్ధి చెందుతుందన్నారు.  అనంతరం ఈస్ట్‌ జోన్‌ డీసీపీ డాక్టర్‌ రవీంద్ర మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగానే ఈజాబ్‌ మేళా నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 500  వందల మంది యువతీయువకులు ఈ మేళాకు హాజరు కాగా.. వీరిలో రెండు వందల మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు.  కార్యక్రమంలో సుల్తాన్‌బజార్‌ ఏసీపీ జి.చక్రవర్తి, మలక్‌పేట ఏసీపీ సుధాకర్, ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని తొమ్మిది మంది సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు