అసాధారణంగా ముగింపు తీర్మానం

10 Mar, 2016 03:09 IST|Sakshi

రూల్ 329ను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్:  రాజధాని భూదందాపై విపక్ష నేత వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు శాసనసభలో సమాధానం చెప్పలేక, సీబీఐ విచారణకు అంగీకరించలేక అయోమయంలో పడ్డ అధికారపక్షం చర్చను ముగించేందుకు రూల్ 329ను హఠాత్తుగా తెరపైకి తెచ్చింది. ‘చర్చ వక్రమార్గం పట్టడంతో రూల్ 329 కింద చర్చను ముగించాలి. తీర్మానం పెడుతున్నాం’ అని మంత్రి యనమల పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో సభ ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ చర్చ ముగిసిందన్నారు.

 భూముల లావాదేవీలపై విచారణతో ఇబ్బందేనన్న స్పీకర్: రాజధాని ప్రాంతంలో భూముల లావాదేవీలపై విచారణకు ఆదేశిస్తే రాజధాని నిర్మాణం ఆలస్యమవుతుందనే అభిప్రాయం ఉందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. రాజధాని భూదందాపై సీబీఐ విచారణ జరిపించాలని బుధవారం అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించిన సందర్బంగా స్పీకర్ కలుగజేసుకొని వివరణ ఇచ్చారు. ‘‘రాజధాని భూములపై వస్తున్న కథనాలపై ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో విచారణకు ఆదేశిస్తే పెట్టుబడులు రావని ప్రభుత్వం కూడా చెబుతోంది’’ అని స్పీకర్ వివరించారు.

మరిన్ని వార్తలు