కొత్త మ్యాప్లొచ్చాయ్

27 Aug, 2016 01:41 IST|Sakshi

 

 

 

 

కొత్త జిల్లాల మ్యాప్‌లు విడుదల చేసిన ప్రభుత్వం

సమస్త సమాచారం పొందుపరిచిన సర్కారు
జిల్లాల సరిహద్దులు, నియోజకవర్గాలు, రైల్వే మార్గాలు తదితర వివరాలు

కొత్త జిల్లాల వెబ్‌సైట్‌లో సమాచారం


హైదరాబాద్: కొత్త జిల్లాలతో ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతిపాదిత 27 జిల్లాలతోపాటు విడివిడిగా 27 జిల్లాల మ్యాప్‌లను తయారు చేసింది. పునర్విభజన ముసాయిదాకు అనుగుణంగా ఈ రేఖా చిత్ర పటాలు రూపొందించారు. జిల్లాల సరిహద్దులు, వాటి పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు, మండలాలు, వాటి సరిహద్దులతోపాటు రైల్వే మార్గాలు, జాతీయ, రాష్ట్ర సరిహద్దులు, నదులు, జల వనరులతో పాటు జలాశయాల వివరాలను ఇందులో పొందుపరిచారు. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ట్రాక్) సాయంతో సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ వీటిని రూపొందించారు. మొత్తం 27 ప్రతిపాదిత జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలు వీటిలో ఉన్నాయి. కొత్త జిల్లాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. కొత్త జిల్లాల మ్యాప్ ల పోర్టల్ http://newdistrictsformation.telangana.gov.inలో చూడవచ్చు.

 
కొత్త జిల్లాలపై కమిటీ...

జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పునర్విభజన సమయంలో కమలనాథన్ కమిటీని నియమించిన తరహాలోనే ఈ కమిటీ వేసేందుకు సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు      ఈ ఫైలు సిద్ధమైంది. కమిటీ గడువు, నిర్దేశించిన మార్గదర్శకాలను ఇందులో పొందుపరిచినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత ఈ నెలాఖరున కమిటీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కమిటీకి ప్రభుత్వం ఏడాది పాటు గడువు నిర్ణయించనుంది. సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ చైర్మన్‌గా ఉండే కమిటీలో అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు సభ్యులుగా ఉంటారు. భేటీలు, సమావేశాలు, సమీక్షలకు వీలుగా ఇప్పుడున్న సీసీఎల్‌ఏ కార్యాలయంలోనే ప్రత్యేక చాంబర్ కేటాయిస్తారు. జిల్లాల పునర్విభజన సందర్భంగా వచ్చిన అభ్యంతరాలు మొదలు ఇతరత్రా తలెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తారు. ప్రధానంగా ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల కల్పన, రెవెన్యూ రికార్డుల భద్రత, రికార్డుల బదిలీ, జిల్లాలు, డివిజన్లు, మండలాల మధ్య భౌగోళిక సరిహద్దు అంశాలన్నీ ఈ కమిటీ పరిధిలోకి చేర్చనున్నారు.


5 వేలు దాటిన అభ్యంతరాలు
కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల వెల్లువ కొనసాగుతోంది. అయిదు రోజుల్లోనే ఆన్‌లైన్‌లో నమోదైన అభ్యంతరాల సంఖ్య 5,300 దాటింది. అత్యధికంగా యాదాద్రి జిల్లాపై 719, వనపర్తిపై 589, హన్మకొండపై 496, ఆచార్య జయశంకర్ జిల్లాపై 224, పెద్దపల్లిపై 187 అర్జీలు దాఖలయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఉన్న డివిజన్ల ఏర్పాటుపై అత్యధికంగా 1,097 ఫిర్యాదులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొత్త మండలాలపై 69 ఫిర్యాదులందాయి.


రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రతిపాదిత కొత్త జిల్లాల మ్యాపులు ఇవే..

ఆదిలాబాద్
తాంసి, జైనథ్, తలమడుగు, మావల, ఆదిలాబాద్, బేల,బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఊట్నూర్, నార్నూర్, జైనూర్, సిర్పూర్ (యూ)
నిర్మల్
నిర్మల్, దిలావర్‌పూర్, కడెం, ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్, కుభీర్, కుంటాల, భైంసా, ముథోల్, లోకేశ్వరం, తానూర్

 

కొమురం భీం (మంచిర్యాల)
చెన్నూర్, జైపూర్, కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్, మందమర్రి, దండేపల్లి, జన్నారం, కాసిపేట, బెల్లంపల్లి, బ్రాహ్మణపల్లి, నెన్నెల, తిర్యాణి, తాండూర్, భీమిని, దహేగాం, ఆసిఫాబాద్, బెజ్జూర్, కాగజ్‌నగర్, కౌటాల, రెబ్బన, సిర్పూర్, కెరమెరి, వాంకిడి

 

నిజామాబాద్
నిజామాబాద్(ద), నిజామాబాద్(ఉ), నిజామాబాద్ రూరల్, ముప్కాల్, డిచ్‌పల్లి, దర్పల్లి, ఇందల్‌వాయి, జక్రాన్‌పల్లి, సిరికొండ, నవీపేట, ఆర్మూర్, ఆలూర్, బాల్కొండ, మెండోర, కమ్మర్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, భీంగల్, మాక్లూర్, నందిపేట, బోధన్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్ని, రుద్రూర్


కామారెడ్డి
బిక్కనూరు, రాజంపేట్, తాడ్వాయి, కామారెడ్డి, దోమకొండ, గాంధారి, లింగంపేట, మాచారెడ్డి, సదాశివనగర్, రామారెడ్డి,  ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, బాన్సువాడ, బిర్కూర్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, నిజాంసాగర్, పిట్లం

 

జగిత్యాల
జగిత్యాల, రాయికల్, సారంగపూర్, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూరు, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం,  మేడిపల్లి, కథలాపూర్

 

కరీంనగర్
కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, మానకొండూరు, తిమ్మాపూర్, బెజ్జంకి, గంగాధర, రామడుగు, చొప్పదండి, వి.సైదాపూర్,  చిగురుమామిడి, వీణవంక, శంకరపట్నం, సిరిసిల్ల, గంభీరావుపేట,  వేములవాడ, చందుర్తి, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట

 

పెద్దపల్లి
పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం,  అంతర్గాం, శ్రీరాంపూర్, కమాన్‌పూర్, మంథని, ముత్తారం

 

సంగారెడ్డి
కల్హేర్, కంగ్టి, నారాయణ్‌ఖేడ్, శిర్గాపూర్, మానూర్, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్,  రామచంద్రాపురం, పుల్కల్, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర, ఆందోల్, నర్సాపూర్, మునిపల్లి, కోహిర్, రాయ్‌కోడ్, ఝరాసంగం, న్యాల్‌కల్, జహీరాబాద్

 

మెదక్
మెదక్, పాపన్నపేట, రామాయంపేట, శంకరం పేట(ఆర్), శంకరంపేట(ఎ), టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడు, కొల్చారం, తూప్రాన్, చేగుంట, కౌడిపల్లి, శివంపేట, వెల్దుర్తి

 

సిద్దిపేట
దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, వర్గల్, చేర్యాల, మద్దూర్, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, నంగునూర్, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, కోహెడ, హుస్నాబాద్, ముస్తాబాద్, ఇల్లంతకుంట

 

హన్మకొండ
హన్మకొండ, కాజీపేట, ధర్మసాగర్, చిల్కూర్, వేలేరు,  స్టేషన్ ఘన్‌పూర్, రాయపర్తి, జఫర్‌గఢ్, నర్మెట, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, హుజూరాబాద్, ఎల్కతుర్తి,  భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లంతకుంట

 

వరంగల్
వరంగల్, ఖిలా వరంగల్, హసన్‌పర్తి, ఐనవోలు,  వర్ధన్నపేట, ఆత్మకూర్, గీసుగొండ, సంగెం, పర్వతగిరి, శాయంపేట, పరకాల, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ


జయశంకర్ (భూపాలపల్లి)
భూపాలపల్లి, ఘణపూర్ (ములుగు), రేగొండ, చిట్యాల,  మొగుళ్లపల్లి, మల్హర్‌రావు, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, వెంకటాపూర్, గోవిందరావుపేట,  ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, ములుగు

 

మహబూబాబాద్
మహబూబాబాద్, కురవి, కేసముద్రం, డోర్నకల్, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూర్, గూడూరు, కొత్తగూడెం, బయ్యారం, గార్ల


ఖమ్మం
ఖమ్మం(అర్బన్), ఖమ్మం(రూరల్), తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, బోనకల్, చింతకాని, ముదిగొండ, కొణిజెర్ల, సింగరేణి,  కామేపల్లి,  రఘునాథపాలెం, సత్తుపల్లి, వేమ్‌సూర్, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, ఎన్కూరు, జూలూరుపాడు, మధిర, ఎర్రుపాలెం

 

కొత్తగూడెం
కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, దమ్మపేట, చంద్రుగొండ, అశ్వారావుపేట, ములకలపల్లి, గుండాల, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక

 

రంగారెడ్డి
మర్పల్లి, మోమిన్‌పేట, వికారాబాద్, ధారూర్, బంట్వారం, పెద్దేముల్, తాండూర్, బషీరాబాద్, యాలాల, నవాబ్‌పేట, శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, దోమ, గండేడ్, కుల్కచర్ల, పరిగి, పూడూరు, షాబాద్


మల్కాజ్‌గిరి
మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, దుండిగల్, బాలానగర్, ఉప్పల్, కీసర, ఘట్‌కేసర్, శామీర్‌పేట్, జవహర్‌నగర్

 

శంషాబాద్
కందుకూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల్, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్‌నగర్, బాలాపూర్, శంషాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట్, కొందుర్గ్, ఫరూక్‌నగర్, కొత్తూరు, కేశంపేట


హైదరాబాద్
బహదూర్‌పుర, ఆసిఫ్‌నగర్, ముషీరాబాద్, సైదాబాద్,  బండ్లగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట, చార్మినార్, తిరుమలగిరి, గోల్కొండ, నాంపల్లి, మారేడుపల్లి, అంబర్‌పేట, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట్యాదాద్రి
ఆలేరు, గుండాల, రాజాపేట, జనగామ, లింగాల ఘన్‌పూర్, మోత్కూర్,  దేవరుప్పుల, బచ్చన్నపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మల రామారం, ఆత్మకూర్(ఎం), బి.పోచంపల్లి,  రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్, మోటకొండూర్, అడ్డగూడూరు

 

నల్లగొండ
చండూర్, చిట్యాల, కనగల్, కట్టంగూర్, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, నారాయణ్‌పూర్, నార్కట్‌పల్లి, తిప్పర్తి, కేతేపల్లి, గట్టుప్పల్, శాలిగౌరారం, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుమల (హాలియా), నిడమనూర్, పెద్దవూర, త్రిపురారం, మాడ్గులపల్లి, తిరుమలగిరి (సాగర్), చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పీఏ పల్లి

 

సూర్యాపేట
ఆత్మకూర్, చివ్వెంల, జాజిరెడ్డిగూడెం, హుజూర్‌నగర్, నూతనకల్, పెన్‌పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరెడుచర్ల, నాగారం, చిల్కూర్, కోదాడ, మఠంపల్లి, మేళ్లచెర్వు, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి

 

మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ రూరల్, అడ్డాకల్, భూత్పూర్, హన్వాడ, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్ అర్బన్, నవాబ్‌పేట్, జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, రాజ్‌పూర్, దేవరకద్ర, మరికల్, బొంరాస్‌పేట, దామరగిద్ద, ధన్వాడ, దౌల్తాబాద్, కొడంగల్, కోస్గి, మద్దూర్, మాగనూరు, మక్తల్, నారాయణ్‌పేట్, నర్వ, ఊట్కూర్

 

నాగర్‌కర్నూల్
బిజినేపల్లి, కొల్లాపూర్, కొడేరు, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, తిమ్మాజిపేట్, తాడూర్, కల్వకుర్తి, ఆమన్‌గల్, మాడ్గుల్, తలకొండపల్లి, వెల్దండ, వంగూర్, చిన్నంబావి, అచ్చంపేట్, అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల్, ఉప్పునుంతల

 

వనపర్తి
వనపర్తి, ఘనపూర్, గోపాల్‌పేట్, కొత్తకోట, పెబ్బేరు,  పెద్దమందడి, వీపనగండ్ల, పానగల్, ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట, గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు, నందిన్నె, అయిజ, ఇటిక్యాల, అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు