ఎమ్మెల్సీ ఎన్నికల పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు

9 Dec, 2015 13:15 IST|Sakshi

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని...నిలిపివేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా.... ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ పిటిషిన్ వేసిన విషయం తెలిసిందే.

 

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ రోజుతో గడువు ముగియనుండడంతో అన్ని పార్టీలు నామినేషన్లు వేసే పనిలో నిమగ్నమైయ్యాయి. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో ససేమీరా అనడంతో టెన్షన్ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి పోటీకి విముఖత తెలపడంతో కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది.     
 

మరిన్ని వార్తలు