ఇంటి పన్ను లేదా కరెంటు బిల్లు తప్పనిసరి

28 Jul, 2017 01:43 IST|Sakshi
ఇంటి పన్ను లేదా కరెంటు బిల్లు తప్పనిసరి
సీ కేటగిరీ వైద్యవిద్య సీట్లకు నిబంధన
 
సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీ కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ) సీట్ల భర్తీలో అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటిపన్ను, కరెంటు బిల్లు, ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌ బిల్లులో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా తెలిపింది. ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

అలాగే సీ కేటగిరీ సీట్లు పొందిన అభ్యర్థులు ఆరు వారాల్లోపు ఆయా దేశాలకు చెందిన ఎంబసీల నుంచి ఎన్‌ఆర్‌ఐ స్టేటస్‌ సర్టిఫికెట్‌ను కాలేజీలో సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది.
మరిన్ని వార్తలు