టీ అమ్మిన వ్యక్తి ప్రధాని

25 Sep, 2014 20:58 IST|Sakshi
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ

హైదరాబాద్: పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితోనే టీ అమ్మిన వ్యక్తి ప్రధాని అయ్యారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.   ప్రధాని నరేంద్ర మోదీని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ మాటలు అన్నారు. దీనదయాళ్ 98వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు భవిష్యత్ లేదన్నారు.  మతం గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినట్లు నిరుపిస్తారా? అని ప్రశ్నించారు. అమలుకు సాధ్యంకాని హామీలను టిఆర్ఎస్ ఇచ్చిందని విమర్శించారు.

డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ దీనదయాళ్ స్ఫూర్తితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఎంపి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ 2019లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. టిఆర్ఎస్పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందన్నారు.
**

మరిన్ని వార్తలు