పులిచింతలలో కనీస మట్టాలుంచాలి

30 Aug, 2017 03:39 IST|Sakshi

కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ వినతి

సాక్షి, హైదరాబాద్‌: పులిచింతల నీటిపై ఆధారపడి ఎత్తిపోతల పథకాల కింద వేసిన పంటలను కాపాడేలా చర్యలు తీసు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు బోర్డుకు లేఖ రాశారు. పులిచింతల నీటితో నల్లగొండ జిల్లాలో 9 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తు న్నాయని, నీటినంతా తోడేస్తుండటంతో వీటికి నీరందడం లేదన్నారు. పెద్దవీడు, మహంకాళీగూడెం,చింత్రియాల, రేపల్లె, అడూకలరు, నక్కగూడెం ఎత్తిపోతల పథ కాల కింద 2,965 ఎకరాల ఆయకట్టు ఉం దన్నారు. పులిచింతలలో కనీస నీటి మట్టం 140 అడుగులు కాగా, ప్రస్తుతం దాని దిగువన తోడేస్తున్నారని, దీంతో ఈ పథకాలకు నీరందక పంటలు ఎండిపోతు న్నాయన్నారు. స్పందించిన బోర్డు, కనీస నీటిమట్టాలుండేలా చర్యలు తీసుకోవా లని మంగళవారం ఏపీని ఆదేశించింది.

మరిన్ని వార్తలు