ప్రైవేటు ఆస్పత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ

3 Jul, 2016 07:12 IST|Sakshi
ప్రైవేటు ఆస్పత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ

బకాయిల విడుదలకు మంత్రి హామీ
 
 సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదంటూ ప్రైవేటు ఆస్పత్రులు వైద్య సేవలను నిలిపేసిన విషయం తెలిసిందే. దీంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి శనివారం సచివాలయంలో ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి.

ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలను దశలవారీగా అందజేస్తామని మంత్రి చెప్పారు. ప్రతీ నెల ప్రభుత్వం చెల్లిం చే రూ.40 కోట్లతో పాటు... జూలై నెలకు  అదనంగా మరో రూ.100 కోట్లు విడుదల చేశామ న్నారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు